KMM: ఏదులాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడు తండాలో నునావత్ భారతికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రారంభించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్‌లతో కలిసి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2026 ఏప్రిల్ నెలలో తదుపరి విడత ఇళ్ల పంపిణీ ఉంటుందని వెల్లడించారు.