AP: అనకాపల్లిలోని SVS కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడంతో హోంమంత్రి అనిత, MLA విజయ్ సందర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ నిర్వహణ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో టోలున్ అనే రసాయనంతో మంటలు చెలరేగాయి. ప్రమాద కారణాలు, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సెంట్రిఫ్యూజ్ దగ్గర మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.