➛ నిద్రపోవడానికి గంట ముందే ఫోన్లు, ల్యాప్టాప్లు దూరంగా ఉండాలి. వీటి నుండి వచ్చే ‘బ్లూ లైట్’ నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ➛ పడుకునే ముందు పాదాలకు నూనెతో మర్దన చేసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి, ఒత్తిడి తగ్గి త్వరగా నిద్ర పడుతుంది. ➛ రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపు వేసిన గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.