SRD: సిర్గాపూర్ పిహెచ్సీలో అన్ని మౌలిక సదుపాయాలపరంగా పాటు రాత్రి సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చేయాలని సిర్గాపూర్ గ్రామ యువకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక PHCలో డాక్టర్ ప్రతిభతో వారు సమావేశమై, ఎమర్జెన్సీ సేవలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన వైద్య సిబ్బందిని వెంటనే నియమించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని యువ నాయకులు కోరారు.