NLR: కందుకూరు (M) విక్కిరాలపేటలో శనివారం MLA ఇంటూరి నాగేశ్వరావు 495 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత పాస్ పుస్తకాల స్థానంలో ప్రభుత్వ ముద్రతో పుస్తకాలు అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. CM చంద్రబాబు రైతులకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు.