BHPL: మున్సిపాలిటీ 17వ వార్డు సుభాష్ కాలనీలో పట్టణ BRS అధ్యక్షుడు జనార్దన్ ఆధ్వర్యంలో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు జ్యోతి హాజరయ్యారు. GVR మాట్లాడుతూ.. జీవో 76 ద్వారా కాలనీల్లో ఇళ్లకు రిజిస్ట్రేషన్, పట్టాలు ఇచ్చామని, దుర్వాసన వెదజల్లుతున్న కుంటను క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేశామని తెలిపారు.