లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని ‘బ్రెయిలీ డే’ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రిలోని జియోస్ స్కూల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె దివ్యాంగ విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.