AP: సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందారని, సమాజంలో సగభాగమైన మహిళా విద్యలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆనాడు ఆమె చేసిన సాహసం.. ఈనాడు మహిళలను విద్యావంతులుగా చేసిందన్నారు. పురుషులకన్నా మిన్నగా తీర్చిదిద్దింది అనడంలో సందేహం లేదన్నారు. ఆమెకు ఆధునిక మహిళలు సదా కృతజ్ఞతలు తెలుపాలన్నారు.