తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 20 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్ శిలాతోరణం వరకు నిలిచిపోయింది. నిన్న ఒక్కరోజే 83,032 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.