SRD: సిర్గాపూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. శుక్రవారం రాత్రి అత్యవసర పరిస్థితిలో వచ్చిన రోగి కి వైద్యం అందించే వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఆ రోగిని 108లో ఖేడ్‌కు ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కూడా సరైన వైద్యం అందకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.