MNCL: వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి వైద్య సేవలు అందుబాటులో ఉంచుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరులోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.