ASR: అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కేంద్రంలో సర్పంచ్ ఎస్.గణేష్ అధ్యక్షతన ఈ నెల 5వ తేదీన ప్రత్యేక గ్రామసభ జరుగుతుందని సెక్రటరీ సతీష్ కుమార్ తెలిపారు. వికసిత్ భారత్-ఉపాధి, జీవనోపాధి హామీ మిషన్(గ్రామీణ)చట్టం-2025పై అవగాహన, చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు, స్థానిక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల ప్రజలు, అన్ని శాఖల సిబ్బంది పాల్గొనాలన్నారు.