సత్యసాయి: ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం తనిఖీ చేశారు. రెవెన్యూ శాఖ పనితీరుపై ఆర్డీవో మహేష్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. భూ రికార్డుల నవీకరణ, రీసర్వే అమలు, పాసు పుస్తకాల జారీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలను పరిశీలించారు. రైతులకు సంబంధించిన సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని ఆదేశించారు.