GNTR: ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన ఎంటెక్ (2/2) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సీఈ ఏ.శివప్రసాదరావు తెలిపారు. విద్యార్థులు పూర్తి ఫలితాల కోసం nagarjunauniversity.ac.in వెబ్సైట్ను సందర్శించవచ్చని సూచించారు.