TG: ఉపాధిహామీ పథకం ద్వారా దాదాపు 60 శాతం మహిళలు ఆదాయం పొందారని మంత్రి సీతక్క అసెంబ్లీలో వివరించారు. రోడ్లు, చెరువులు, నీటి వనరుల పునరుద్ధరణకు నరేగా పథకం ఉపయోగపడిందన్నారు. రాష్ట్రంలో 34 లక్షల ఉపాధిహామీ పథకం జాబ్ కార్డులు ఉన్నాయన్నారు. 54 లక్షల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. పథకం అమలులో తెలంగాణ.. దేశంలోనే ముందు నిలిచిందన్నారు.