బాపట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న (పీ–4) కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు.