TPT: ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ చెప్పారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించి, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రజా దర్బార్ (PGRS) లక్ష్యమన్నారు. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించగా, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు.