NRPT: మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో అయ్యప్ప స్వామి 20వ మహా పూజోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శివాలయం నుంచి అయ్యప్ప ఆలయం వరకు కలశం ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ప్రత్యేక మహా పూజలు నిర్వహించి అయ్యప్ప నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.