KMM: కొనిజర్ల సొసైటీ కార్యాలయం వద్ద యూరియా పంపిణీ వ్యవస్థను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. యూరియా పంపిణీ క్రమబద్ధంగా, పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు.