ASR: రంపచోడవరం మండలం గోగుమిల్లి గ్రామంలో తహసీల్దారు బాలాజీ ఆధ్వర్యంలో నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనేక గ్రామాల్లో రీ-సర్వే చేసి అర్హులైన వారికి మాత్రమే ఈ నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.