SRPT: హైదరాబాద్లో జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే డీబీఎస్యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించారు. దళిత కుటుంబాలకు రూ.12 లక్షల సాయం, సాగు భూములపై హక్కులు కల్పించాలని, ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు అరికట్టాలని అన్నారు