అన్నమయ్య: తంబళ్లపల్లె(M) కన్నెమడుగు సచివాలయంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఇవాళ పంపిణీ చేశారు. గ్రామంలో 655 మంది రైతులకు అందజేశామని MRO శ్రీనివాసులు చెప్పారు. నూతన పాసు పుస్తకాల్లో మార్పులు, చేర్పులు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో రెడ్డెప్ప రెడ్డి, సురేంద్ర, భూమిరెడ్డి, భాస్కర్ రెడ్డి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.