GDWL: ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలు, ఆయన ధైర్యసాహసాలు నేటి యువతకు దిక్సూచి అని మేకలసోంపల్లి సర్పంచ్ జయరాముడు పేర్కొన్నారు. శుక్రవారం మల్దకల్ మండలంలోని మేకలసోంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువత జై శివాజీ నినాదాలతో హోరెత్తించారు.