NLR: జిల్లాలో ఈనెల 4వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు కుమారుడి జన్మదినం సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కందూకూరులోని ZP హైస్కూల్లో జరిగే ఈ శిబిరంలో ప్రజలకు వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు ఇస్తారని పేర్కొన్నారు. అవసరమైన వారికి పెదకాకానిలో ఆపరేషన్లు చేయిస్తారని తెలియాజేశారు.