CTR: కుప్పం రూరల్ మండలం ఉర్లఓబనపల్లె గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను PKM-UDA ఛైర్మన్ డా. బీఆర్ సురేష్ బాబు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, రైతులకు నిజమైన న్యాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.