BPT: పంగులూరు మండలం, తూర్పు తక్కెళ్ళపాడు గ్రామంలో శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. తొలుత తూర్పు తక్కెళ్ళపాడులో 20 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి రవికుమార్ ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన పట్టాదారు పుస్తకాలను మంత్రి అందజేశారు.