MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి గుల్పర్తి గ్రామానికి చెందిన ప్రజలు గురువారం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఏడవ వార్డులో ఇతర వార్డులకు చెందిన ఓటర్లు ఉండటంతో తమకు రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. గుల్పర్తి గ్రామానికి చెందిన ఓటర్లను మాత్రమే ఏడవ వార్డులో చేర్చాలని, అలాగే బీసీ రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.