MBNR: వేములలో దళిత యువతి ప్రవళికపై పాశవిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాల వెలుగు సంఘం రాష్ట్ర కార్యదర్శి దండు లక్ష్మణ్‌తో కలిసి మంత్రి వివేక్‌ను కలిసారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.