KRNL: మంత్రాలయం (మం) సుంకేశ్వరిలో విద్యుత్ శాఖ అధికారి గోవిందు ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ ఇవాళ నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారుల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని ,నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నాని భరోసా ఇచ్చారు.