MBNR: నకిలీ కారంపొడి కలకలం సృష్టించిన ఘటన బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కొత్త సంవత్సర సందర్భంగా వంటకాలకు గ్రామంలో ఓ కిరాణా షాపులో కొందరు వ్యక్తులు కారంపొడి కొన్నారు. తమ వంటకాలలో వేయగా.. రంగు తప్ప రుచి లేకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. కారంపొడి నకిలీదని తేలింది.