JGL: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండలం తుంగూరులో రూ. 20 లక్షలతో చేపట్టిన నూతన జీపీ భవన నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గ్రామ పంచాయతీ స్థలదాత సర్పంచ్ రాజగోపాల్ స్థలానికి సంబంధించిన అఫిడవిట్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా డీఈ మిలిందికి అందజేశారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.