వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలతో పాటు అధికారులు, సిబ్బందికి కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రానున్న సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించి, తమ లక్ష్యాలను విజయవంతంగా సాధించాలని ఆకాంక్షించారు. పోలీసు శాఖ మరింత స్నేహపూర్వకంగా ప్రజలకు సేవలందిస్తుందని హామీ ఇచ్చారు.