MBNR: వీరన్నపేట్లోని వీరభద్రకాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను కాలనీవాసులు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే నూతన బోరును ఏర్పాటుచేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన వెంటనే సిబ్బంది నూతనబోరు డ్రిల్ చేశారు. గురువారం మోటర్ ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. సమస్య పరిష్కరించనందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.