KNR: మానకొండూరు మండలం తమిళ కాలనీలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూ పోరాట దీక్ష చేశారు. ఉద్యమకారులు 250 గజాల చొప్పున భూములు ఆక్రమించుకోవాలని కవిత తెలిపారు. 12 సంవత్సరాలుగా ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తానని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.