JGL: దేశాన్ని, హిందూ దేవతలను కించపరిచిన నా అన్వేషణ అన్వేశ్పై దేశద్రోహం కేసు పెట్టాలని, భారత్ సురక్ష సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం జగిత్యాలలో వారు మాట్లాడుతూ.. నా అన్వేషణ అన్వేశ్ అనే యాత్రికుడు హిందూ దేవతలైన సీతా, ద్రౌపదీ మాతలను అవమానకరంగా మాట్లాడడమే కాకుండా దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడని ఆరోపించారు.