VZM: ప్రకృతిని ఈరోజు కాపాడితే రేపు భావితరాలు సురక్షితమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా.ఏ.కృష్ణ ప్రసాద్ అన్నారు. పూసపాటిరేగ మండలం కందివలసలోని HBL ఇంజినీరింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో పర్యావరణ అవగాహన కార్యక్రమం నేడు నిర్వహించారు. వృక్ష సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై అవగాహన కల్పించారు.