AP: అన్నమయ్య జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. సుండుపల్లి మండలం రాయవరం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులందరినీ పాఠశాల సిబ్బంది వెంటనే రాయవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.