SKLM: పాతపట్నం టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో అద్భుత విజయాలు, హామీల అమల్లో రికార్డులు సాధించిందని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామన్నారు.