KRNL: మద్దికేర(మం) పెరవల్లి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం తలనీలాల వేలం పాట నిర్వహించారు. ఈవో రెబ్బవీరయ్య, ఛైర్మన్ పారా రవికుమార్ సమక్షంలో వేలం జరిగింది. వివిధ జిల్లాల వ్యాపారులు పాల్గొనగా, గుంతకల్లుకు చెందిన మారెన్న రూ.10.25 లక్షలకు ఏడాది పాటు తలనీలాల హక్కు దక్కించుకున్నారు.