MBNR: జిల్లాలో చేపడుతున్న భూ సర్వే పనులపై అదనపు రెవెన్యూ కలెక్టర్ మధుసూదన్ నాయక్ బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గండీడ్ మండలం సాలార్నగర్లో అమలవుతున్న భూ సర్వే పైలట్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో నవీన్, అసిస్టెంట్ ల్యాండ్ సర్వే ఏడీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.