సత్యసాయి: బుక్కపట్నంలోని స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులకు జనసేన యువ నాయకుడు తోట అనిల్ క్రికెట్ దుస్తులను స్పాన్సర్ చేశారు. బుధవారం పుట్టపర్తి జనసేన ఇంఛార్జ్ పత్తి చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.