KDP: పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును సలహాదారుల పేరుతో పప్పులు, బెల్లంలా పంచిపెట్టడం ఏ మాత్రం భావ్యం కాదని తులసి రెడ్డి విమర్శించారు. బుధవారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. జీవోలు జారీ చేసి సలహాదారులకు క్యాబినెట్ ర్యాంకులు, భారీ జీతాలు ఇవ్వడం సరికాదన్నారు. ఉచితంగా సలహాలు ఇచ్చేవారు నిజమైన సలహాదారులని వ్యాఖ్యానించారు.