GNTR: పొన్నూరు వైసీపీ మండల ఉపాధ్యక్షులు సౌపాటి శ్రీధర్ తల్లి మృతిచెందారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదేశాల మేరకు పార్టీ నేతలు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి వైసీపీ నేత, కార్యకర్తలు పాల్గొన్నారు.