MBNR: ఎరువుల కొనుగోలు కోసం రైతులు దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని మహబూబ్ నగర్ ఏఈవో శివ తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్‌పై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన యూరియాను ముందే బుక్ చేసుకోవచ్చని సూచించారు.