కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును జిల్లా టీడీపీ నూతన అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ వెల్లడించారు.