అనకాపల్లి 82వ వార్డు సమీపంలో గల శారదా నది గ్రోయిన్స్ను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రోయిన్స్ పూర్తిగా శిథిలం అయినట్లు తెలిపారు. అలాగే నాగులపల్లి పంట కాలువ లాక్స్ పరిశీలించారు. గ్రోయిన్స్ మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు.