E.G: నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. బుధవారం నల్లజర్లలో ఏఎంసీ ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజుతో కలిసి ఆయన పింఛన్లు అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.