BDK: చండ్రుగొండ గ్రామపంచాయతీలో ఇవాళ నూతన కార్యవర్గ సభ్యులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి గ్రామపంచాయతీలో ఉన్న మంచినీటి వాటర్ ట్యాంకులు అన్నింటిని శుభ్రం చేయించారు. సర్పంచ్ రుక్మిణి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.