గుంటూరు ప్రజలకు అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన, శుభ్రమైన ఆహారాన్ని నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మిర్చి యార్డులోని అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.