KMM: జిల్లాలో ప్రస్తుతం 14,388 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 82 ప్యాక్స్ కేంద్రాలు, 84 ప్రైవేట్ డీలర్ల ద్వారా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచే పంపిణీ జరుగుతోందన్నారు. మరో 4,300 మెట్రిక్ టన్నులు రిజర్వ్ ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.